ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ గురువారం బాధ్యతల స్వీకరించారు. సీఎస్‌గా రిటైర్ అయిన ఆదిత్యనాథ్ దాస్ స్థానంలో కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ వచ్చారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి సమీర్ శర్మ కృతజ్ఞత తెలియజేశారు.
అందరి సహకారంతోనే
అందరి సహకారంతో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సమీర్ శర్మ. రిటైర్ అయిన ఆదిత్యనాథ్‌దాస్‌కు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొన్నారు. ఆయన సేవలు కొనియాడారు.
ఆదిత్యనాథ్‌దాస్ సెకెండ్ ఇన్నింగ్
ఆంధ్రప్రేదశ్‌ను ఉన్నతమైన రాష్ట్రంగా నిలబెట్టేందుకు తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాన్నారు. ఆదిత్యనాథ్ దాస్. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. ఇన్నాళ్లే తనకు సహకరించిన ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిధుల సమీకరణ కొత్త సీఎస్‌కు సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
గుర్తుకొస్తున్నాయి
సబ్ కలెక్టర్‌గా తన ప్రస్తానం ప్రారంభించి సీఎస్ స్థాయికి చేరుకున్న జర్నీని గుర్తు చేసుకున్నారు కొత్త సీఎస్ సమీర్ శర్మ. పని చేసిన ప్రతి చోటా ప్రశంసలే అందుకున్నాని.. ఎక్కడా ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా పని చేశానన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని... ఇకపై కూడా ఇదే పంథా కొనసాగుతుందన్నారాయన.
ఇక ప్రభుత్వ సలహాదారు
సీఎస్‌గా రిటైర్ అయిన ఆదిత్యనాథ్‌దాస్... ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఢిల్లీ నుంచి ఆయన ఈ బాధ్యతలు అమలు చేస్తారు.
ALSO READ: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో విపరీతంగా.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవే..
ALSO READ: మరో రెండ్రోజుల్లో ఏపీలో భారీ వర్షం.. తెలంగాణకూ వర్ష సూచన, ఈ ప్రాంతాల్లోనే..
ALSO READ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?
ALSO READ: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..
ALSO READ: పోలీసు స్టేషన్‌లో నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్.. పోలీసు అధికారికి ట్రాన్స్‌జెంజర్స్ సన్మానం