Minister Pinipe Viswarup : ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. అమలాపురం పర్యటనలో ఉన్న మంత్రి విశ్వరూప్ కు ఛాతీలో నొప్పితో బాధపడ్డారు. ఆయనను ముందుగా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 


వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమానికి హాజరు


ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అంబేడ్కర్‌ జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న మంత్రి విశ్వరూప్‌‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది, నాయకులు అప్రమత్తమై మంత్రి విశ్వరూప్‌ ను అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. అమలాపురంలో వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమానికి హాజరైన సమయంలో మంత్రికి ఛాతీలో నొప్పి వచ్చింది. మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థత గురించి తెలుసుకున్న ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తున్నారు. 


కోనసీమ అల్లర్లలో మంత్రి పినిపే ఇళ్లు దగ్ధం 


కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు ఇటీవల దాడులకు పాల్పడ్డాయి. అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ అద్దెకు ఉంటున్న ఇంటిపై నిరసనకారులు దాడికి చేసి నిప్పుపెట్టారు. అల్లరి మూకలు పెట్రోల్‌ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయి మంటలు వ్యాపించారు. ఈ మంటల్లో మంత్రి పినిపే విశ్వరూప్ ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో మంత్రి విశ్వరూప్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిరసనకారులు తగలబెట్టిన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ అప్పట్లో పరిశీలించారు. తన ఇంటిని తగలబెట్టడం చాలా దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి నిరసనలు ఇలా విధ్వంసానికి దారితీస్తాయని అనుకోలేదన్నారు. సంఘ విద్రోహ శక్తులు నిరసనను దారి మళ్లించి విధ్వంసం సృష్టించారన్నారు. 


Also Read : World Coconut Day 2022: కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అంటున్న కోనసీమ వాసుల కథ ఇదే!


Also Read : YSR Death Anniversary: ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్‌కు సీఎం జగన్​ నివాళులు, భావోద్వేగంతో ట్వీట్