YSR Vardhanthi: కడపలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం నివాళులు అర్పించారు. తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి తండ్రి వైఎస్సార్ కు ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్ విజయమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులు సైతం నివాళులర్పించిన అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తండ్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
నాన్నకు ప్రేమతో వైఎస్ జగన్ ట్వీట్..
‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ’ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు ఆయన వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ భవన్‌లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించిన నేతలు అనంతరం పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ వద్దకు చేరుకుని వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
‘సంక్షేమ శ్రామికుడు, మహానేత వైఎస్సార్, #YSRForever జనం గుండెల్లో ఒక చెరగని సంతకం! #YSRLivesOn అంటే ఒక ఆత్మీయ పలకరింపు, ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన రోజు!’ అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Also Read: Girl Died With Dengue Fever: సీఎం జగన్ తో చలాకీగా తిరిగిన ఆ బాలిక మృతి, ఆ చిన్నారి ఎవరంటే !
Also Read: Jalsa Shows Cancelled: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం - థియేటర్లపై రాళ్లదాడి, జల్సా షోలు రద్దు