Happy Birthday Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ రీరిలీజ్ లో సైతం కలెక్షన్లు వసూలు చేస్తోంది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు జల్సా ప్రదర్శిస్తున్న థియేటర్లకు క్యూ కట్టారు. థియేటర్ల వద్ద పవన్ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేశారు. అయితే పవన్ ఫ్యాన్స్ అభిమానం పలు పట్టణాల్లో అదుపుతప్పినట్లు కనిపిస్తోంది. పలు నగరాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం చేశారు. థియేటర్లపై రాళ్లదాడికి పాల్పడటంతో జల్సా షోలు రద్దు చేశారు థియేటర్ యాజమాన్యం.
శ్రీరామ థియేటర్‌పై దాడి
పవన్‌ కళ్యా్ణ్ నేడు 51 వసంతంలోకి అడుడుపెడుతున్నారు. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా కర్నూలులోని శ్రీరామ థియేటర్‌ (Sri Rama Theatre)లో జల్సా సినిమా స్పెషల్‌ షోలు ప్రదర్శించారు. మ్యూజికల్ హిట్‌తో పాటు గతంలో భారీ వసూళ్లు రాబట్టిన జల్సా మూవీని చూసేందుకు పవన్‌ అభిమానులు కర్నూలోని శ్రీరామ థియేటర్‌కు వెళ్లారు. సినిమా చూస్తున్న ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. థియేటర్‌లో సౌండ్‌ సిస్టం సరిగాలేదని, సినిమాను ఇలాగేనా ప్రదర్శించేది అంటూ ఆందోళనకు దిగిన పవన్ ఫ్యాన్స్.. శ్రీరామ థియేటర్ పై రాళ్ల దాడికి పాల్పడి అద్దాలు ధ్వంసం చేశారు. పవన్ ఫ్యాన్స్ హంగామా, రాళ్లదాడితో థియేటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్ యాజమని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జ్యోతి థియేటర్ లో షోస్ రద్దు
జల్సా మూవీ ఏపీ, తెలంగాణలో పలు థియేటర్లలో భారీ ఎత్తున రీరిలీజ్ చేశారు. నేడు పవన్ బర్త్ డే కావడంతో వైజాగ్ లీలా మహల్ లో జ్యోతి థియేటర్ (Jyothi Thatre in Vizag) లో జల్సా మూవీ ప్రదర్శిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల వీరంగం చేశారు. జల్సా సినిమా ప్రదర్శన జరుగుతుండగా అత్యుత్సాహం ప్రదర్శించారు. జ్యోతి థియేటర్ లో సీట్లు దాదాపుగా ధ్వంసం చేశారు. దీంతో చేసేదేమీ లేక థియేటర్ యాజమాన్యం జల్సా ఇక్కడ వేయాల్సిన షోస్ రద్దు చేసింది. 


జల్సా గ్రాండ్ రీ రిలీజ్.. థియేటర్స్ వద్ద రచ్చ చేసిన అభిమానులు..
రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాని 4కె రిజల్యూషన్ లో మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. గతం కంటే ఎక్కువగా నెల్లూరులో మొత్తం 13 థియేటర్స్ లో జల్సా మూవీ రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద హంగామా సృష్టించారు అభిమానులు. నెల్లూరులోని థియేటర్స్ వద్ద జనసేన నాయకులు కూడా సందడి చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. 


Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా 


Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే