Telangana Inter 2nd Year Vocational Results 2025: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | Telangana Intermediate Results 2025

Telangana Inter 2nd Year Vocational Results 2025: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఈ ఫలితాలు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.


Telangana Inter 2nd Year Vocational Results 2025: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం 12 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్‌మీడియెట్‌ ఫస్ట్, సెకండ్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. మొదటి ఏడాది పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 24 వరకు రెండో ఏడాది పరీక్షలు మార్చి 6 నుంచి మార్చి 25 వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులు 5,00,572మంది ఉంటే సెకండియర్ రాసిన వారు 4,96,399 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఫలితాలు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.