TS Inter 1st Year Results 2025 | తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | Telangana Intermediate Results 2025

Telangana Inter 1st Year Results 2025: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల కానున్నాయి. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


TS Inter 1st Year Results 2025: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 22న ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఉదయం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలు విడుదల చేస్తారు. మంగళవారం ఉదయం 12 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఇంటర్‌ ఫస్టియర్ రెగ్యూలర్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను కూడా విడుదల కానున్నాయి. మొదటి ఏడాది పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు తెలంగాణలో ఇంటర్ బోర్డ్ నిర్వహించింది. ఈ ఏడాది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు 5,00,572మంది పరీక్షలు రాశారు. ఈ ఇందులో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. మంగళవారంఉదయం ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.