Telangana TS Inter 1st Year Vocational Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి

TS Inter 1st Year Vocational Results 2024: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదల కానున్నాయి. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


Telangana 1st Year Inter Vocational Results: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 22న అధికారిక ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ఫస్టియర్ రెగ్యూలర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదల కానున్నాయి.ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు ఉన్నారు. బుధవారం ఉదయం ఏబీపీ దేశం వెబ్ సైట్‌లో ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.