Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

TS Inter Results 2026 1st and 2nd Year: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

TS Board Result Dates

TS Inter Results 2026: హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12 (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ కార్యదర్శి, టీజీబీఐఈ వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు.                 

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.41 లక్షలు కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.07 లక్షల మంది ఉన్నారు

http://results.cgg.gov.in ,  https://tgbie.cgg.gov.in  లలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

 
Sponsored Links by Taboola