TS Inter 2nd Year Results 2025 Live | తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | Telangana Intermediate Results 2025

Telangana Inter 2nd Year Results 2025: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ఫలితాలను ఏప్రిల్ 22న వెల్లడించనున్నారు. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


TS Inter 2nd Year Results 2025: తెలంగాణలో 2024-25 ఏడాదికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇంటర్‌మీడియెట్‌ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 6 నుంచి మార్చి 25 వరకు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు రాస్తే అందులో రెండో సంవత్సరం పరీక్షలు రాసిన వాళ్లు 4,96,399 మంది. వీరిలో ఒకేషనల్ కోర్సులు కూడా రాసిన వాళ్లు ఉన్నారు.