TS INTER 1ST YEAR RESULTS 2023 | తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
Telangana Inter 1st Year Results 2023: తెలంగాణలో వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో
Telangana Inter 1st Year Results 2023: ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 4,82,675 మంది పరీక్షకు హాజరైతే... 2,97,741 మంది పాస్ అయ్యారు. ఇందులో 2,41,673 మంది బాలికలు పరీక్షలు రాస్తే... 1,65,994 మంది పాస్ అయ్యారు.
68.68l%మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 2,41,002 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తే... 1,31,747 మంది పాస్ అయ్యారు. బాలురు 54.66% మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. చివరిస్థానంలో మెదక్(38%) నారాయణ పేట్(41%) జయశంకర్ భూపాల్‌పల్లి(45%), వికారాబాద్(46%), పెదపల్లి(46%)తో నిలిచాయి.