Telangana 10th Exam Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

Telangana 10th Exam Results 2024: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పది పరీక్షలకు 4,91,862 మంది విద్యార్ధులు హాజరయ్యారు.


Telangana 10th Exam Results 2024: తెలంగాణలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదోతరగతి ఫలితాలు వచ్చేశాయి. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత ఇంద్రా రెడ్డి టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పదోతరగతి పరీక్షలకు 4,91,862 మంది విద్యార్ధులు హాజరయ్యారు.పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS SSC Results 2024)

  • Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట ఏపీబీ ఇచ్చిన రిజల్ట్స్‌ లింక్‌ను https://telugu.abplive.com/exam-results/telangana-ts-class-10-results-live-tsbie-62b456ac84df0.html క్లిక్‌ చేయండి
  • Step 2: వెంటనే మీకు హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2024) లింక్ మీద క్లిక్ చేయండి
  • Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
  • Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
  • Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2024 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
  • Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.

గతేడాది రిజల్ట్స్‌ చూస్తే...

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది. 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.