Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లపై వరద నీరేనా.. లేక నది ఉప్పొంగుతోందా?!

Continues below advertisement

హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. శివారుప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షంపాతం నమోదైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సికింద్రాబాద్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం కాలనీలోనూ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వరద నీరు చూస్తుంటే.. ఏదో నది ఉప్పొంగి ప్రవహిస్తున్నట్టు ఉందని పలువురు అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram