Huzurabad Bypolls: నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్ రావు సవాల్

Continues below advertisement

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హుజురాబాద్ నియోజ‌క‌వర్గం పెంచిక‌ల్ పేటలో ఎన్నికల ప్రచారంలో మంగ‌ళ‌వారం మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థికి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే  తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. రుజువు చేయలేకపోతే ఎన్నికల నుంచి రాజేందర్ తప్పుకుంటారా అని సవాల్ చేశారు.  ప్లేస్, టైం డిసైడ్ చేయాలన్నారు. సిలిండర్ ధరలపై టీఆర్ఎస్, బీజేపీ  నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కు అధికారంలో ఉన్నప్పుడు పేదలు కనిపించలేదన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram