Curious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురంలో ఓ బాలుడు వింత ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు నెలలుగా తనకు తాను శివ స్వరూపంగా చెప్పుకుంటున్న ఆ పిల్లాడు.. వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన రూపమైన శివలింగం భూమిలో ఆరడుగుల లోతులో ఉందంటూ దానిని బయటకు తీయాలంటూ చెప్తున్నాడు. ఇదే విషయంపై గత కొంతకాలంగా చర్చించిన గ్రామంలోని పెద్ద మనుషులు.. తవ్వకాలు జరిపారు. ఆరడుగుల లోతు తీసినా ఎటువంటి విగ్రహం బయటపడ లేదు. బాలుడు చెబుతున్న ప్రదేశం పూర్తిగా అటవీ ప్రాంతం. గతంలో ఇక్కడ పోడు నరికి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. బాలుడు చూపించిన ప్రదేశం కూడా గతంలో వారు ఆక్రమించిన స్థలం పక్కనే ఉండడం గమనార్హం. అటవీ భూమిని ఆక్రమించుకునేందుకే దేవుడు పేరుతో ఇలా డ్రామాలు చేస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.