Adilabad Ghats Waterfalls | ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఘాట్ లు

Continues below advertisement
అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షకాలంలో వనమంతా పచ్చగా కళకళలాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. పచ్చనైన అడవులలో అందమైన ప్రకృతి సోయగం.. వాటి నడుమ కొండలపైన, లోతట్టు ప్రాంతాల్లో ఉండే గ్రామాలు.. అడవుల మధ్య గలగల పారే సెలయేర్లు.. కొండలపై నుండి జాలువారుతున్న అందమైన జలపాతాలు.. కనువిందు చేస్తు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల, లోహార, చీచ్ ధరి ఘాట్ ప్రకృతి అందాలు, ధారలొద్ది, మోలల్ గుట్ట, సాత్ కుండి, భద్ భదీ జలపాతాలు, కాశ్మీర్, ఊటి లను తలపించే ప్రకృతి సోయగం పై abp దేశం ప్రత్యేక కథనం.ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల, లోహార, చిచ్ ధరి ఘాట్ ప్రకృతి అందాలు.. అక్కడి ధారలొద్ది, మొలాల్ గుట్ట, సాత్ కుండి, భద్ భదీ జలపాతాలు.. కాశ్మీర్, ఊటీ లాంటి సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను తలపించేలా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ అందమైన ప్రకృతి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది పర్యాటకులు, కుటుంబసమేతంగా పిల్లాపాపలతో, బంధుమిత్రులతో, యువతీ,యువకులు వస్తు రోజంతా ప్రకృతి అందాల నడుమ సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొండలపై నుండి ఘాట్ అందాలను తిలకిస్తూ ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ మరి కొంతమంది రీల్స్ చేస్తూ.. మరికొందరు అక్కడి జలపాతాలలో కేరింతల నడుమ స్నానాలు చేస్తూ సంబరంగా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ అక్కడే వంటకాలు చేసుకొని వన భోజనాలు ఆచరించి ప్రకృతి ఓడిలో రోజంతా ఆనందంగా కాలక్షేపంగా గడిపి తిరిగి తమ తమ గమ్యానికి పయణమవుతున్నారు.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram