India Hockey Team Beat Australia |ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత్ | ABP Desam
టీమిండియాను ఆసీస్ ను మట్టికరిపించింది. అయితే ఇది జరిగింది క్రికెట్ లో కాదు హాకీలో. ఎస్ భారత్ హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లోనూ అదరగొడుతోంది. 2012 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యపతకం గెలిచి 1980 తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత జట్టు ఈసారీ అదే కాన్ఫిడెన్స్ తో సంచలనాలే సృష్టిస్తోంది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 3-2 గోల్స్ తేడాతో ఆసీస్ ను ఓడించింది. 1972 తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ గెలవటం ఇదే. భారత జట్టు సమష్టి కృషితో 52ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా మీద గెలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా...అభిషేక్ ఓ గోల్ కొట్టాడు. ఆస్ట్రేలియా తరపున థామస్ క్రెయిగ్, బ్లేక్ గోవర్స్ చెరో గోల్ చేశారు. చివరి ఐదు నిమిషాల్లో గోల్ పోస్ట్ మీద అటాక్ చేయటానికి మ్యాచ్ ను డ్రా చేయటానికి ఆస్ట్రేలియా తీవ్రంగా ప్రయత్నించినా మన గోల్ కోపర్ శ్రీజేష్ గోడలా నిలబడి ఆసీస్ కొట్టిన గోల్స్ ను అడ్డుకున్నాడు. దీంతో భారత్ గ్రూప్ బీ లో రెండో స్థానం సాధించి ఈవెంట్ లో ముందుకు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్రిటన్ తో తలపడనుంది.