IPL 2024 Playoffs | What Happens If IT Rains |ప్లే ఆఫ్స్‌లో వర్షం పడితే..రిజర్వ్ డే ఉందా..?
IPL 2024 Playoffs | What Happens If IT Rains |ప్లే ఆఫ్స్‌లో వర్షం పడితే..రిజర్వ్ డే ఉందా..? | ఐపీఎల్ కు ఇప్పుడు వర్షం ఫీవర్ పట్టుకుంది. కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో వర్షం పడితే సంగంతేంటీ అన్న భయం ఇప్పుడు ఫ్యాన్స్ లో మొదలైంది. ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో వర్షం పడితే ఏం జరుగుతుందో సింపుల్ గా క్లియర్ కట్ గా చెప్తాను తెలుసుకోండి. సాధారణంగా లీగ్ మ్యాచుల్లో వర్షం పడినప్పుడు రెగ్యూలర్ టైమ్ కంటే ఒక గంట సమయం ఎక్కువగా ఇస్తారు మ్యాచ్ కంప్లీట్ చేయడానికి. చెరో ఇన్నింగ్స్ లో కనీసం 5 ఓవర్లు పడే ఛాన్స్ ఉంటే మ్యాచ్ ఆడిస్తారు. లేకుంటే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు కదా..! ప్లే ఆఫ్ మ్యాచుల్లో వర్షం పడితే మ్యాచ్ జరగపడిని 2 గంటల ఎక్స్ ట్రా టైమ్ ఇస్తారు. అంటే..మ్యాచ్ రెగ్యూలర్ గా 11 న్నర వరకు కంప్లీట్ అవుతుంది. వర్షం పడితే మ్యాచ్ కంప్లీట్ చేయడానికి ఒకటిన్నర వరకు టైమ్ ఉంటుందనమాట. ఐనప్పటికీ.. ఆ రోజంతా వర్షం పడిందనుకోండి రిజర్వ్ డే ఉంది. తరువాత రోజు మ్యాచ్ జరుగుతుంది. ఇలా క్వాలిఫైయర్స్1, ఎలిమినేటర్స్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ ఇలా ప్రతి మ్యాచుకు రిజర్వ్ డే ఉంది. ఐనప్పటికీ..కర్మ కాలి... రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడిందనుకోండి... పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న టీమ్ నే విజేతగా ప్రకటిస్తారు. అదే కనుక జరిగితే ఎలా ఉంటుందో చెప్పనా..! క్వాలిఫైయర్స్ 1లో కేకేఆర్ వెర్సస్ ఎస్ఆర్హెచ్.. పాయింట్స్ టేబుల్ లో కేకేఆర్ టాప్ లో ఉంది కాబట్టి ఆ జట్టే విజేత. ఇక.. ఎలిమినేటర్స్ లో ఆర్ఆర్ వెర్సెస్ ఆర్సీబీ.. ఇందులో ఆర్ఆర్ కే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్స్ మ్యాచ్ జరుగుతంది. అప్పుడు వర్షం పడింది అనుకోండి హైదరాబాద్ కే నెట్ రన్ రేట్ ఎక్కువ కాబట్టి హైదరాబాద్ ఫైనల్ లోకి వెళ్తుంది. ఇక..ఫైనల్ లో నూ వర్షం పడిందనుకోండి కేకేఆర్, హైదరాబాద్ టీమ్స్ లో కేకేఆర్ కే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ జట్టుకే ట్రోఫి వెళ్తుంది. ఇలా.. అన్ని రిజర్వ్ డేలలో కూడా పూర్తిగా వర్షం పడటం ఈ ఎండకాలంలో అసాధ్యం కాబట్టి.. ఇది 99శాతం జరగకపోవచ్చు. కానీ, ఒకవేళ జరిగితే మాత్రం రూల్స్ ఇవి.