Will Pucovski Forced to Retire | తప్పనిసరి స్థితిలో రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ ఆటగాడు పుకోవ్ స్కీ
ఆటలు అంటేనే అంత. మనకు అపారమైన ప్రతిభ ఉన్నా పరిస్థితులు అనుకూలించకపోతే అర్థాంతరంగా కెరీర్ ను ముగించాల్సిందే. ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు విల్ పుకోవ్ స్కీ ఇప్పుడు అందుకే హాట్ టాపిక్ గా మారింది. రీజన్ ఏంటంటే అతను 26సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు మెరుపు ఓపెనర్ గా మారతాడని..డేవిడ్ వార్నర్ వారసుడని ఎప్పుడో పేరు తెచ్చుకున్న విల్ పుకోవ్ స్కీ తప్పని సరి పరిస్థితుల్లో కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడి ఆటకు వీడ్కోలు పలికేశాడు. దీనికి రీజన్ కంకషన్.ఆట ఆడేప్పుడు ఏదైన పరిస్థితుల వల్ల తలకు గాయమయ్యే పరిస్థితిని కంకషన్ కు లోనవ్వటం అంటారు. దిమ్మ తిరిగినట్లు ఉండే ఆ స్థితిలో ఆటగాడు ఆటను కొనసాగించటం కష్టం కాబట్టి క్రికెట్లో కంకషన్ రిటైర్మెంట్ రూల్ ను తీసుకువచ్చారు. ఆస్ట్రేలియా దేశవాళ్లీ మ్యాచుల్లో అదరగొట్టి ఫ్యూచర్ స్టార్ గా కంగారూల జట్టులో అడుగుపెట్టిన విల్ పుకోవ్ స్కీ 2021లో టీమిండియాపై సిడ్నీలో తన కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు. ఆ తర్వాత టీమిండియా తో మరిన్ని మ్యాచులు ఆడాల్సి ఉన్నా కంకషన్ కు లోనవటంతో అతను సిరీస్ ను తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి మళ్లీ దేశవాళ్లీ ఆడటం..ఇంటర్నేషనల్ సిరీస్ కు సెలెక్ట్ అవటం..మ్యాచ్ ఆడటానికి ముందు కంకషన్ కు లోనవటం...అనుకోకుండా మళ్లీ విశ్రాంతి. విల్ పుకోవ్ స్కీ ఇదే ప్రతీ సారి రిపీట్ అయ్యింది. మూడేళ్లలో మొత్తం 10సార్లు విల్ పుకోవ్ స్క్రీ కంకషన్ కు లోనవటంతో...డాక్టర్లు ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకోవాలని పుకోవ్ స్కీకి సూచించారు. మరోసారి క్రికెట్ బాల్ కనుక తలకు తగిలితే అది కోమాలోకి దారి తీయొచ్చని హెచ్చరించటంతో ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పుకోవ్ స్క్రీ 26ఏళ్ల చిన్న వయస్సులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పుకోవ్ స్క్రీ కెరీర్ లో ఇదొక కఠినమైన దశ అని అతను ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలని మాజీలంతా పుకోవ్ స్కీకి బాసటగా నిలుస్తున్నారు ధైర్యం చెబుతున్నారు.