Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTeam India At ITC Maurya Hotel in Delhi | టీం ఇండియా ఆటగాళ్లు దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ITC మౌర్య హోటల్ కు చేరుకున్నారు.దిల్లీ ఎయిర్ పోర్టులో టీం ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అలాంటి స్వాగతమే హోటల్ లో కూడా లభించింది. బయట ఫ్యాన్స్ కేరింతలతో ఆహ్వానం పలుకగా..హోటల్ లోపల స్టాఫ్ చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. క్రికెటర్లను చూస్తు అక్కడి వారంతా మురిసిపోయారు. ఇక్కడ కాసేపు సేద తీరిన తరువాత.. వరల్డ్ కప్ గెలిచిన ఈ టీమ్ ప్రధాని మోదీని కలవనుంది. ఆ తరువాత టీం ఇండియా ఆటగాళ్లు ముంబయి చేరుకుంటారు. అక్కడ వరల్డ్ కప్ తో భారీ ర్యాలీ ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ శనివారమే పూర్తైనప్పటికీ... టీం ఇండియా ఆగాళ్లు ఇంత లేటుగా సొంత గడ్డపై అడుగుపెట్టడానికి కారణం..బార్బడోస్ లో తుపాన్ రావడమే. దీంతో.. ఫ్లైట్ జర్నీ వాయిదా పడింది.