South Africa vs India T20 World Cup Final Weather | T20WC ఫైనల్ లో వరుణుడు అడ్డుపడితే పరిస్థితి ఏంటీ
బార్బడోస్ లో భారత్, దక్షిణాఫ్రికా టీ2౦ వరల్డ్ కప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ తుది సమరం మొదలు కానుంది. అయితే ఇదే టైమ్ లో వరుణుడు మ్యాచ్ కు ఆటంకం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బార్బడోస్ లో తుపాను హెచ్చరికను జారీ చేశారు. 80శాతం మేఘాలు ఆవృతమై వరుణుడు ఏ క్షణంలోనైనా మ్యాచ్ కు అడ్డంపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. మరి ఫైనల్ మ్యాచ్ ను వర్షం ఆపేస్తే అప్పుడు పరిస్థితి ఏంటీ ఈ వీడియోలో చూద్దాం.
టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించినా ఇబ్బంది లేకుండా రిజర్వ్ డే కూడా ఉంది. అంటే రెగ్యులర్ గా కాకుండా వరల్డ్ కప్ ఫైనల్ కాబట్టి ఈ మ్యాచ్ లో ప్రతీ జట్టు కనీసం పది ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. సో వర్షం పడితే అలా కనీసం పది ఓవర్లు బ్యాటింగ్ చేసే పరిస్థితి ఉందా అని చూస్తారు. ఇందుకోసం 190 నిమిషాల ఎక్స్ ట్రా టైమ్ కూడా పెట్టుకున్నారు. వెస్టిండీస్ కాలమానం ప్రకారం అక్కడ మ్యాచ్ జరిగేది ఉదయం కాబట్టి సో సాయంత్రం, రాత్రి మ్యాచ్ ను కొనసాగించటానికి చూస్తారు. ఒకవేళ ఇవాళ వర్కవుట్ కాకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. రేపు ఉదయం నుంచి సేమ్ సాయంత్రం వరకూ చూస్తారు. రేపు కూడా 190నిమిషాల ఎక్స్ ట్రా టైమ్ కూడా ఉంటుంది. అప్పటికి కూడా 10ఓవర్ల మ్యాచ్ అన్నా నిర్వహించే అవకాశం లేకుండా వర్షం పడుతూనే ఉంటే..ఇక టీమిండియా, సౌతాఫ్రికాను రెండింటీనీ సంయుక్తంగా విశ్వవిజేతలుగా ప్రకటిస్తారు. సో వర్షం పడకుండా మ్యాచ్ జరగాలని కొదమసింహాల్లాంటి రెండు జట్లు కప్పు కోసం హోరా హోరీగా తలపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.