Rohit Sharma only Player 1St T20 World Cup and Now | చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ | ABP
రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కురువృద్ధుడు. అదేంటీ 37ఏళ్ల వయస్సుంటే కురువృద్ధుడు అయిపోతాడా అనేగా మీ డౌట్. కాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మనే. ఎందుకంటే 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ లో ఆడి...ఇప్పుడు 2024 లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడుతోంది రోహిత్ శర్మనే. 2007 టీ20 వరల్డ్ కప్ లో తన టీమ్ లో 20ఏళ్ల రోహిత్ శర్మను ఎంచుకున్నాడు ఎమ్మెస్ ధోని. అప్పుడు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ క్వార్టర్ ఫైనల్లో సౌతాఫ్రికా మీద హాఫ్ సెంచరీతో అదరగొట్టేస్తాడు. 40 బాల్స్ లో రోహిత్ శర్మ అప్పుడు కొట్టిన హాఫ్ సెంచరీనే టీమిండియాను సౌతాఫ్రికా మీద 37పరుగుల విజయం సాధించేలా చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ మీద జరిగిన ఫైనల్లోనూ హిట్ మ్యాన్ తన దైన స్టైల్ లో ఆడేస్తాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు మిడిల్ ఆర్డర్ లో 16 బాల్స్ ఆడి 30పరుగులు చేసి నాటౌట్ గా నిలుస్తాడు రోహిత్ శర్మ. సో అప్పుడు పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించి విశ్వవిజేతలుగా వరల్డ్ కప్పు అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పుడు 17ఏళ్ల తర్వాత మరో టీ20 వరల్డ్ కప్ కోసం 37ఏళ్ల వయస్సులో కెప్టెన్ గా భారత్ జట్టును నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. తిరుగులేని విజయాలతో, బెదురులేని బ్యాటింగ్ తో తన జట్టును ఫైనల్ కు తీసుకువచ్చిన రోహిత్ శర్మ ఈ రోజు సౌతాఫ్రికాను చిత్తు చేసి వరల్డ్ కప్ అందుకుంటే చాలు ఎలా టీ20 వరల్డ్ కప్ తో తన కెరీర్ ప్రభంజనం మొదలైందో ఏ సౌతాఫ్రికా మీద తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టాడో..ఇప్పుడు అదే సౌతాఫ్రికాను మళ్లీ చిత్తు చేసి..మళ్లీ 17ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.