Rohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. ఈ టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్, వైస్ కెప్టెన్. కానీ రెండు నెలల క్రితం కథ వేరు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఓసారి విజేతగా, ఓ సారి ఫైనలిస్ట్ గా నిలిపిన కెప్టెన్ పాండ్యా ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అయితే అయ్యాడు కెప్టెన్ గా రావటమే కొంప ముంచింది. ఐదు సార్లు ఐపీఎల్ గెలిపించిన రోహిత్ శర్మను అవమానకరరీతిలో పక్కకు తప్పించారని అది పాండ్యా వల్లే జరిగిందంటూ హార్దిక్ మీద విపరీతమైన ట్రోలింగ్. దానికి తగ్గట్లుగా టోర్నీలో ముంబై దారుణ ప్రదర్శన చేయటంతో బ్లేమ్ గేమ్ అంతా పాండ్యా మీదే సాగింది. పాండ్యా కూడా రోహిత్ శర్మను అవమానించాడని...ఫీల్డింగ్ టైమ్ లో రోహిత్ మీద హార్ష్ గా ప్రవర్తించాడంటూ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ టైమ్ లో టీమ్ రెండు ముక్కలు అయ్యిందని...రోహిత్, పాండ్యా వర్గాలుగా ముంబై ఇండియన్స్ విడిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని గొడవల మధ్య పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో ఉండటమే అందరికీ ఆశ్చర్యం. తీసి పక్కన పాడేస్తాడనుకున్న రోహిత్ తన డిప్యూటీగా పాండ్యానే కొనసాగించాడు. కానీ వరల్డ్ కప్ లో ఆ పొరపొచ్చాలు ఎక్కడా కనిపించలేదు. పైగా రోహిత్ బ్యాటింగ్ లో ఆదుకుంటే పాండ్యా బ్యాట్, బాల్ తోనూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. ఫైనల్లోనూ ప్రమాదరక క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు తీసిన పాండ్యా ఆఖరి ఓవర్ లో సౌతాఫ్రికా 16 కొట్టాలంటే సఫారీలను అడ్డుకుని టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. అందుకే రోహిత్ పాండ్యా మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ప్రపంచకప్ గెలవగానే ముందు ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ...తర్వాత పాండ్యా దగ్గరకు హగ్ చేసుకుని..అప్పటికే ఏడుస్తున్న పాండ్యాను ఓదార్చాడు. బుగ్గమీద ముద్దు పెట్టి వైస్ కెప్టెన్ మీద తనకున్న వాత్సల్యాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఈవీడియోలు, ఫోటోలే వైరల్ గా మారాయి వాళ్ల మధ్య గొడవలు కాదు ముద్దులున్నాయి అంటూ రోహిత్, పాండ్యా ఫ్రెండ్ షిప్ ను ఆకాశానికెత్తేస్తున్నారు ఫ్యాన్స్.