MS Dhoni Ruturaj Gaikwad IPL 2024 CSK: నాలుగేళ్ల క్రితం జట్టులో చోటే కష్టం.. ఇప్పుడు చూస్తే కెప్టెన్

Continues below advertisement

MS Dhoni Ruturaj Gaikwad IPL 2024 CSK | 2020 ఐపీఎల్ సీజన్ గుర్తుందా. అది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. లీగ్ స్టార్ట్ అయినదగ్గర్నుంచి ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా ప్లేఆఫ్స్ కు వెళ్లిన చెన్నై.... తొలిసారిగా టాప్-4కు చేరుకోలేకపోయిన ఏడాది అది. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్. ఆ సీజన్ లో ఓ మ్యాచ్ లో ఓటమి తర్వాత ధోనీ ఏమన్నాడో గుర్తుందా.... కుర్రాళ్లలో స్పార్క్ కనపడలేదన్నాడు. ఏ ఒక్కరి గురించో కాదు. కొత్తగా ఛాన్స్ ఇచ్చిన కొందరి గురించి. అందులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram