Afghanistan Crisis: తాలిబన్లు మళ్లీ ఎలా వచ్చారు..? దానివల్ల భారత్‌కు నష్టం ఏంటి..?
ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబాన్ల వశమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వారు దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. తాలిబన్‌లు అధికారంలోకి రావడానికి అమెరికా పరోక్షంగా సహకరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొవిడ్19తో అమెరికా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా బిలియన్ల డాలర్లు వెచ్చిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో సేనలను కొనసాగించడం వీలుకాదని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో నాటో దళాల్ని అమెరికా ఉపసంహరించుకోవడంతో ఒక్కసారిగా తాలిబన్లు చెలరేగిపోయారు. తాము చెప్పినట్లుగానే ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రభుత్వాన్ని కూలద్రోసి తాలిబన్ రాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చింది. తాలిబన్లతో ఎదురుదాడికి దిగితే ఆర్థిక, ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భావించి, ఏ మాత్రం ప్రతిఘటించకుండా అధికారం అప్పగించింది. పాక్, చైనా తాలిబన్లతో స్నేహాన్ని కొనసాగించడానికి సిద్ధమని ప్రకటించాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుతో భారత్‌లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితులు భారత్‌పై ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.