Chennai Floods: జలదిగ్బంధంలో చెన్నై నగరం
ABP Desam
Updated at:
07 Nov 2021 10:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చుట్టు పక్కల జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో ఇదే భారీ వర్షమని వాతావరణ శాఖ తెలిపింది. విల్లివక్కమ్లో 162 మిమీ, నుంగమ్బక్కమ్లో 145 మిమీ ఫుజల్లో 111 మిమీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలోని కొరటూరు, పెరంబూర్, అన్నాసాలై, టీనగర్, గిండి, అడయార్, పెరుంగుడి, ఓఎంఆర్తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు సీఎం స్టాలిన్.