Team India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam
Team India Lands In Delhi After World Cup Win |
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..! ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. 13 ఏళ్ల తరువాత ఐసీసీ కప్పు మన భారత గడ్డలో అడుగుపెట్టింది.ఈ రోజు ఉదయం టీ20 వరల్డ్ కప్ తో టీం ఇండియా దిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టారు. ఈ వీరులకు స్వాగతం పలకడానికి అధికారులు ఘన స్వాగతం ఏర్పాటు చేయగా మరోవైపు...ఫ్యాన్స్ కూడా భారీగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. జయహో టీం ఇండియా నినాదాలతో దిల్లీ ఎయిర్ పోర్టు దద్దరిల్లింది. అనంతరం..హోటల్ కు చేరుకోనున్న టీం ఇండియా ఆ తరువాత ప్రధాని మోదీని కలవనుంది. వీలైతే.. ప్రధానితో లంచ్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ఆ తరువాత టీం ఇండియా ఆటగాళ్లు ముంబయి చేరుకుంటారు. అక్కడ వరల్డ్ కప్ తో భారీ ర్యాలీ ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ శనివారమే పూర్తైనప్పటికీ... టీం ఇండియా ఆగాళ్లు ఇంత లేటుగా సొంత గడ్డపై అడుగుపెట్టడానికి కారణం..బార్బడోస్ లో తుపాన్ రావడమే. దీంతో.. ఫ్లైట్ జర్నీ వాయిదా పడింది.