Dharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్
ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ప్రజలు గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం అయితే కొంత మంది మాత్రం సోషల్ మీడియా సామాజిక సేవ కోసం సమర్థంగా వినియోగిస్తూ పది మందికి సాయపడే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఈయన పేరు రేణిగుంట రమేశ్. నిరుపేదలకు అండగా నిలబడటం వారి జీవితాలు గాడిన పడటం కోసం తన వంతు సాయంగా సేవలందిస్తున్న ఈయనకు సేవా మాధ్యమం అంటే ఫేస్ బుక్ అనే చెప్పాలి. అదే వీరందిరికీ రమేశ్ ని పరిచయం చేసింది..వాళ్లకు సాయం అందేలా చేసింది.
ధర్మపురికి మండలం బుద్దేశి పల్లి కి చెందిన ఈ పాప పేరు వైష్ణవి. కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్లో ఆడుకుంటూ హఠాత్తుగా కిందపడింది తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపిస్తే కొద్ది రోజులకి మామూలు స్థితికి వచ్చింది కానీ మరికొద్ది రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి. తీవ్రమైన జ్వరంతో కదలిక లేకుండా మంచానికి పరిమితమైపోవాల్సిన పరిస్థితికిలోకి వెళ్లిపోయింది. కరీంనగర్ హైదరాబాద్ అంటూ ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో హాస్పిటల్లో చూపించిన లక్షలు ఖర్చు చేసిన వ్యాధిని కనుక్కోలేక పోయారు వైద్యులు దీనితో వైష్ణవి పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రమేష్. ఆ పోస్ట్ కు ఎంతోమంది స్పందించారు వైష్ణవి కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకొని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్నాఆరైలు సాయం అందించారు. ఫలితంగా ఆ పాపకు ఇప్పటివరకూ తొమ్మిది లక్షల రూపాయలు విరాళాలు కేవలం ఫేస్బుక్ ద్వారా సేకరించిన అందించటంలో సాయపడ్డారు రేణిగుంట రమేశ్. ఆ డబ్బుతో పాప మెదడుకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు పాప ఇంకా మంచానికే పరిమితమై ఉన్నా ఆరోగ్యపరంగా మాత్రం కోలుకుందని తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు