Uravakonda Online Order: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆశ్చర్యపోయేలా చేసిన ఆన్ లైన్ ఆర్డర్

Continues below advertisement

ఈ కామర్స్ సైట్‌లో ఏదైనా వస్తువు బుక్ చేస్తే దాని స్థానంలో రాళ్లు, పండ్లు వస్తున్న సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో Mi ఫోన్ బుక్‌ చేస్తే దానికి బదులుగా రాయి వచ్చిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు కథనం ప్రకారం..వంశీకృష్ణ అనే యువకుడు 6వ తేదీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15990 విలువచేసే రియల్‌మీ ఫోన్ బుక్‌చేశాడు. గురువారం డెలివరీ బాయ్ శ్రీనివాసులు వచ్చి పార్సిల్‌ ఇచ్చి అతని నుంచి రూ.15990 తీసుకున్నాడు. సాధారణంగా ఆ యువకుడు ఏది కొన్న పార్సెల్ తెసే ముందు వీడియో తీసి అలవాటు ఉండడంతో.. ఇప్పుడు వచ్చిన పార్సిల్‌ను విప్పుతూ ఇంకో ఫోన్‌లో వీడియో కూడా తీశాడు. తీరా పార్సిల్‌ తొలగించగా బాక్సుకు ఉన్న సీల్ తొలగించి ఉండడంతో ఆ యువకుడు అవాక్కయ్యాడు.. దాన్ని తెరిచి చూడగా సుమారుగా 500 గ్రాముల బరువున్న రాయి బయటపడింది. ఈ విషయాన్ని ఆ యువకుడు డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా తనకు ఏమి తెలియదని పార్సిల్‌ మీకు ఇచ్చి రమ్మంటే వచ్చానని తెలిపాడు. పార్సెల్ తొలగించిన వీడియో డెలివరీ బాయ్ కు చూపించగా అప్పుడు సంస్థ నుండే ఏదో పొరపాటు జరిగినట్లు గుర్తించి డెలివరీ బాయ్ పై అధికారులను అడిగి అతని డబ్బులు వెనక్కి ఇచ్చారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram