Tirumala Decoration: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం అలంకరణ
Continues below advertisement
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు,పండ్లతో సర్వాంగ సుందరంగంగా అలంకరించగా... ఆలయ మహా గోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లన్నీ విద్యుత్ దీపాలంకరణతో దేదీపమాన్యంగా వెలిగిపోతున్నాయి. కలియుగ ఇల వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల కొండను వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శోభయుమానంగా తీర్చిదిద్దింది టీటీడీ.. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వస్తున్న భక్తులు నిజంగానే వైకుంఠంలోకి ప్రవేశించామన్నట్లు ఈ ఏట టీటీడీ అలంకరణలు చేసింది.. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడి ఉద్యానవన సిబ్బంది.
Continues below advertisement