నెల్లూరు జిల్లాలో కరోనా భయంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మూత..
Continues below advertisement
నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొవిడ్ కారణంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తాళం పడింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది ఒకరికి కరోనా సోకినట్టు నిర్థారణ కావడంతో ఆఫీస్ కి తాళం వేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆఫీస్ ని శానిటైజ్ చేసి తిరిగి తెరిచే ప్రయత్నం చేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే.. సంతకాలు, వేలిముద్రలు, దస్తావేజులు.. ఇలా చాలా పనులు కొవిడ్ వ్యాప్తికి అవకాశం కలిగించేవే. దీంతో అధికారులు వెంటనే ఆఫీస్ మూసివేశారు.
Continues below advertisement