SI Wins everyone’s Hearts: తన మానవత్వంతో అందరి మనసులు గెలుస్తున్న ఎస్సై |ABP Desam

Continues below advertisement

Warangal జిల్లాలోని ఓ SI మానవత్వపు చర్యకు నలువైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాయపర్తి మండలం కొండూరు పరిధిలో చెరువు పక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నారని ఎస్సై బండారి రాజుకు సమాచారమొచ్చింది. వెంటనే ఓ చొక్కా, లుంగీ తీసుకుని రాజు అక్కడికి బయల్దేరారు. వృద్ధుడు నడవలేని స్థితిలో కనిపించారు. ఆయనకు స్వయంగా దుస్తులు తొడిగిన ఎస్సై రాజు.... అక్కడి వరకు అంబులెన్స్ వచ్చే ఆస్కారం లేదని గ్రహించారు. సుమారు కిలోమీటర్ వరకు ఆ వృద్ధుడ్ని మోసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్ లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram