Shaik Hasan Saheb : మరణానంతరం పద్మశ్రీ అవార్డు ను పొందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు

Continues below advertisement

భద్రాచలం రామాలయంలో నాదస్వర విద్వాంసుడిగా పనిచేసిన ,తిరువూరు కు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబ్ కు కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1930లో గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించారు. చిలకలూరిపేట చిన మౌలా సాహెబ్ వద్ద సంగీత శిక్షణ పొందిన ఆయన భద్రాచలం, యాదగిరి గుట్ట దేవస్థానాల్లో నిలయ విద్వాంసులుగా పనిచేశారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం లో కూడా పలు కార్యక్రమాలు అందించారు. పలువురు విద్యార్థులకు సంగీతం లో శిక్షణ ఇవ్వడం తో పాటు గత 67 సంవత్సరాల పాటు తిరువూరు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో సంగీత కచేరీలు చేశారు. 2021లో జూన్ 24 న హసన్ సాహెబ్ మృతి చెందారు. మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన అభిమానులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram