NO BHOGI VILLAGES: శ్రీకాకుళం జిల్లాలోని ఈ రెండు పల్లెల్లో మీరు భోగిపండుగ చూడలేరు..!
Continues below advertisement
సంక్రాంతి పండుగ అంటేనే సరికొత్త వెలుగుల పండుగ. సంక్రాంతి అంటేనే అర్థమది. పాత కష్టాలను, దు:ఖాలను భోగిమంటల్లో పారద్రోలి....సరికొత్త వర్ణాల జీవితానికి స్వాగతం పలకాలనేది పండుగ వెనుక పరమార్థం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ గా జరిపే సంక్రాంతిలో భోగి, సంక్రాంతి, కనుమ రోజులు చాలా ప్రత్యేకం. అన్నింటికంటే ముఖ్యంగా భోగిపండుగను చిన్నలు, పెద్దలు అంతా ఇష్టపడతారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పాతవస్తువులను మంటల్లో పడేసి కొత్తదనానికి స్వాగతం పలుకుతారు. ఇంతటి మహత్తరమైన పండుగలకు కొన్ని తరాలుగా దూరంగా ఉంటున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాలు.
Continues below advertisement