Nellore Crime : మాజీ లవర్ ని హత్యచేయబోయి పోలీసులకు దొరికిన మహిళ| ABP Desam
Continues below advertisement
Nellore జిల్లా ఆత్మకూరులో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని కారు ఢీకొనడంతో.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి కాలు విరిగింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులకు ఆ ప్రమాదంపై అనుమానం కలిగింది. కారు డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అసలు కథేంటని ఆరా తీశారు. తీరా అది ఓ హత్యాయత్నం అని తేలే సరికి షాకయ్యారు.
Continues below advertisement