MLA Kakani: తిరుపతి పార్లమెంట్ లో ఉన్న సర్వేపల్లి...నెల్లూరు జిల్లాలోనే ఎందుకుంది..?
Continues below advertisement
నెల్లూరు జిల్లాకు గుండెకాయ కృష్ణపట్నం పోర్ట్. జిల్లాకే తలమానికం విక్రమ సింహపురి యూనివర్శిటీ. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ రెండూ నెల్లూరు జిల్లా నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాను విభజిస్తే.. పారిశ్రామిక ప్రాంతం ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాకు వెళ్లిపోతుంది. అంతే కాదు... సర్వేపల్లి రైతులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. కానీ కానీ స్థానిక శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పట్టుబట్టి మరీ సర్వేపల్లిని నెల్లూరునుంచి విడిపోకుండా అడ్డుకున్నారు. సర్వేపల్లి విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు తమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. కాకాణి గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్..
Continues below advertisement