Medaram Jathara: సమ్మక్కసారలమ్మ జాతర కోసం దిల్ సుఖ్ నగర్ లో ప్రత్యేక పూజలు..ఎందుకంటే..?

Continues below advertisement

సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు అడవిలో నుంచి అమ్మవారిని తీసుకువచ్చే వెదురు బుట్టలు తయారీ పూజా మహోత్సవం దిల్ సుఖ్ నగర్ శాలివాహన నగర్ లో నిర్వహించారు. సుమారు 30 సంవత్సరాలుగా నిలిచిపోయిన అనవాయితీని ఈ ఏడాది తిరిగి ప్రారంభించారు. శాలివాహన నగర్ లో పిల్లి మహేందర్ కుమార్ నివాసంలో బుట్టల తయారీ కార్యక్రమం మొదలు చేశారు. మేడారం పూజారి జానకమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని... మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడో రోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్క సారక్కలను గద్దె మీదకు దించడంతో జాతర పూర్తవుతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram