ఫ్రెండ్‌ని కాపాడిన రతన్ టాటా, పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తి

Continues below advertisement

రతన్ టాటా మృతి చెందారన్న వార్తని ఇంకా చాలా మంది నమ్మలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయన గురించి పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా ఓ లెజెండ్‌ని కోల్పోయిందని నివాళి అర్పిస్తున్నారు. ఆయన చేసిన సోషల్ సర్వీస్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే..ఆయన క్యాన్సర్‌ మహమ్మారి బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారు. అలా సాయం పొందిన ఓ వ్యక్తి రతన్ టాటా ముఖాన్ని తన ఛాతిపై పచ్చబొట్టు పొడిపించు కున్నాడు. ఎందుకింత అభిమానమని అడిగితే..అతను చెప్పిన కథ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తన ఫ్రెండ్‌కి క్యాన్సర్ వచ్చిందని, ఆ జబ్బుతో పోరాడలేక..అటు డబ్బులూ లేక చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పాడు. 

ఆ సమయంలోనే టాటా ట్రస్ట్ గురించి తెలిసింది. ఆ ట్రస్ట్ ఉచితంగా తన ఫ్రెండ్‌కి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇచ్చిందని వివరించాడు. అలా తన ఫ్రెండ్‌ ప్రాణాల్ని టాటా కాపాడారని చెప్పాడు. ఆయనే లేకపోతే ఫ్రెండ్ బతికే వాడే కాదని, ఆయన ఓ దేవుడు అని భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన విలువలని, సేవా గుణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు. ఆయనకు గుర్తుగానే ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఇక నెటిజన్లు...టాటాని పొగుడుతున్నారు. ఆయనో జెంటిల్‌మెన్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram