Kadiyam Srihari : బండి సంజయ్ కు కడియం శ్రీహరి సీరియస్ వార్నింగ్
Continues below advertisement
తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి భాజపాపై విమర్శలు చేశారు. వరంగల్ లో సభ పెట్టే అర్హత భాజపాకు లేదన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల సంగతేంటని ప్రశ్నించారు. తెలంగాణకు భాజపా చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. మధ్యప్రదేశ్, అసోం సీఎంలకు మతి ఉందా అని ఆగ్రహించిన శ్రీహరి... అభివృద్ధి సూచీల్లో ఆయా రాష్ట్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు
Continues below advertisement