సొరంగంలో సిన్వర్ ఫ్యామిలీ, పాత వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

Continues below advertisement

గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై అకస్మాత్తుగా దాడి చేసింది హమాస్‌. అప్పటి నుంచి ఇజ్రాయేల్, హమాస్ యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. అయితే...ఈ మొత్తం విధ్వంసానికి కారణమైన హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని చంపేసింది ఇజ్రాయేల్. ఈ క్రమంలోనే ఓ ఎక్స్‌క్లూజివ్ వీడియో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడులు చేసే కొద్ది గంటల ముందు సిన్వర్‌ ఏం చేశాడో చూడండి అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఓ సొరంగం వద్ద ఈ వీడియో అంతా రికార్డ్ అయింది. పౌరులందరినీ ఆ టన్నెల్‌లోకి పంపిన సిన్వర్ ఆ తరవాత దాడులకు అంతా ప్లాన్ చేసుకున్నట్టు ఇజ్రాయేల్ వివరించింది. ఈ వీడియోలో చాలా సార్లు కనిపించాడు సిన్వర్. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న సిన్వర్‌..ఓ టీవీని సొరంగంలోకి తీసుకెళ్లాడు.  ఆ తరవాత మరి కొన్ని సామాన్లు తీసుకెళ్లాడు. అతనితో పాటు ఓ మహిళ, చిన్నారులు కూడా కనిపించారు. ఇలా ఒక్కొక్కరినీ సొరంగంలోకి తీసుకెళ్లి..అప్పుడు దాడులకు స్కెచ్ వేశాడు. DECLASSIFIED FOOTAGE అంటూ ఇజ్రాయేల్‌ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌ ఒకరు ఈ వీడియో విడుదల చేశాడు. దాదాపు 3 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియో..ప్రస్తుతం సంచలనమవుతోంది.    సౌత్ గాజాలో నిఘా పెట్టిన ఇజ్రాయేల్ సైన్యం..వెంటాడి మరీ సిన్వర్‌ని చంపేసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram