Wayanad Landslides | Farewell to Indian Army | వయనాడ్ లో సైనికులకు ఘన వీడ్కోలు | ABP Desam

Continues below advertisement

Wayanad Landslides | Farewell to Indian Army | వయనాడ్ కొండచరియల బీభత్సం ఎంత నష్టం చేసిందో గుర్తుంది కదా..! ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు. 24 గంటలు ఆన్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఎందరో ప్రాణాలు కాపాడారు..బురదలు ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. రవాణాకు 36 గంటల్లోనే బ్రిడ్జి కట్టారు. ఏం తిండి తిన్నారేమో గానీ అనుక్షణం వయనాడ్ మళ్లీ మాములుగా అయ్యేందుకు కృషి చేశారు. పరిస్థితి చక్కబడటంతో రెస్క్యూ ఆపరేషన్ టీమ్ వయనాడ్ నుంచి బయలుదేరింది. ఈ సమయంలో కష్టసమయంలో తమకు అండగా ఉన్న సైనికులకు స్థానికులు ఘన వీడ్కోలు పలికారు. చప్పట్లు కొడుతూ...భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మిగతా దేశాల్లో ఎలా ఉంటుందో తెలీదు గానీ.. ఇండియాలో మాత్రం ఆర్మీని ప్రేమిస్తారు.. ఆరాధిస్తారు..గౌరవరిస్తారు అనడానికి ఇదే ఉదాహరణ అంటూ నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram