Sitaram Yechury Passed away | సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి | ABP Desam

Continues below advertisement

 కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన వయస్సు 72సంవత్సరాలు. చాలా కాలంగా న్యూమోనియో తో బాధపడుతున్న సీతారాం ఏచూరి శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. బుధవారం నుంచి వెంటేలిటేర్ మీదున్న సీతారాం ఏచూరి పరిస్థితి అప్పటి నుంచే క్రిటికల్ గా ఉన్నా వైద్యులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఇన్ ఫెక్షన్ ఎక్కువ అవటంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1952లో మద్రాసులో జన్మించిన సీతారాం ఏచూరిది తెలుగు కుటుంబమే. ఆయన తల్లి తండ్రులు సర్వేశ్వరసోమయాజులు ఏచూరి, తల్లి కల్పకం ఏచూరిది కాకినాడనే. యువకుడిగా ఉన్నప్పుడే విప్లవభావజాలం వైపు ఆకర్షితుడైన ఏచూరి అప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయటం ప్రారంభించారు. హైదరాబాద్ లో చదువుకున్న ఏచూరి 1969 తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఢిల్లీలో ఎకనమిక్స్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. యువకుడిగా SFI తో మొదలైన ఆయన ప్రయాణం..సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఆ పార్టీలో దేశంలో అత్యున్నత స్థానం వరకూ తీసుకెళ్లింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram