Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

Continues below advertisement

 మన ఊళ్లలో బస్సు ఎక్కినప్పుడు అందులో దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూస్తే దొంగలకు కోపం వస్తుంది. వాడేదో దొంగతనం చేయటానికి వస్తే మనం అలా బోర్డు పెట్టి మన వాళ్లను జాగ్రత్తపడమని దొంగలను బాధ పెడుతుంటాం. అలాగే తమిళనాడులో బలమైన గొంతుకలన్నీ కలిసి మా భాషను దొంగతనం చేయొద్దు అని అరుస్తూ ఉంటాయి. మా భాషను దొంగతనం చేయొద్దు..మా గుర్తింపును లాగేసుకోవద్దు అని మనం అరుస్తుంటే మరి దొంగలకు కోపం రాదా. దొంగలకు కోపం వచ్చేలా చేస్తుండండీ కొత్తగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం(ఉదయనిధి స్టాలిన్). నాకు తెలిసిన దగ్గర ఓ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయనేదేదో నోటికి వచ్చింది అరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఓ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. మనకు సమానత్వం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం కావాలి. మీరు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram