ISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desam

Continues below advertisement

 అంతరిక్షంలో ఈరోజు రెండు ఉపగ్రహాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోనున్నాయి. అది కూడా చేస్తోంది మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో. సోమవారం నైట్ 10 గంటలకు జరిగే స్పేడెక్స్ ప్రయోగం ఇస్రోకు చాలా కీలకం. శ్రీహరికోట నుంచి లాంఛ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు సైంటిస్టులు. అసలు ఇప్పుడు ఈ ప్రయోగం ఏంటో తెలుసుకుందాం. స్పేడెక్స్ అంటే ఫుల్ ఫామ్ స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్. అంటే ఏం లేదు రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి అక్కడ ఆ రెండు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి కలిసేలా చేస్తారు. ఇలా రెండు వేర్వేరు వస్తువులు ఒకటి కలిసే ప్రక్రియనే డాకింగ్ అంటారు. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ నిర్మాణం అంతా కూడా ఇలా డాకింగ్ ద్వారానే జరిగింది. వేర్వేరు దేశాలకు చెందిన స్పేస్ స్టేషన్లు అన్నీ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గా ఏర్పడ్డాయి. ఇప్పుడు భారత్ మాత్రం 2035నాటికి సొంతంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ కట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసమే ఈ డాకింగ్ ప్రయోగం. ఈ ప్రయోగంలో రెండు శాటిలైట్లను రాకెట్ ద్వారా మోసుకెళ్లి...రెండింటినీ వేర్వేరుగా భూమి చంద్రుడు కక్ష్యలో ప్రవేశపెడతారు. అది కూడా రెండింటి మధ్య 470కిలోమీటర్ల దూరం ఉండేలా చేస్తారు. ఒక రాకెట్ ను ఛేజర్ శాటిలైట్ అని మరో రాకెట్ ను టార్గెట్ శాటిలైట్ అని పిలుస్తారు. ఈ రెండు శాటిలైట్లకు రోబోటిక్ హ్యాండ్స్ లాంటివి ఉంటాయి. సో దేన్నైనా ఛేజర్ అని పిలుచుకోవచ్చు దేన్నైనా టార్గెట్ అని పిలుచుకోవచ్చు. 220 కిలోల బరువు ఉండే ఈ ఒక్కో శాటిలైట్ 470 నుంచి మెల్ల మెల్లగా తమ మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ ఉంటాయి. అంటే టార్గెట్ శాటిలైట్ స్లో అవుతూ ఉంటుంది. ఛేజర్ శాటిలైట్ స్పీడ్ గా దాన్ని అందుకోవటానికి వెళ్తుంది. చివరగా 20కిలోమీటర్ల దూరం మాత్రమే రెండింటి మధ్య ఉన్నప్పుడు డాకింగ్ ప్రక్రియ చివరి స్టేజ్ మొదలువుతుంది. రెండు క్రమక్రమంగా స్పీడ్ తగ్గించుకుంటూ దగ్గరికి వచ్చి ఒకదానితో ఒకటి డాకింగ్ అవుతాయి. అచ్చం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లు అన్నమాట. ఈ ప్రయోగం సక్సెస్ చేయటం ద్వారా ఇలా అంతరిక్షంలో డాకింగ్ చేసిన నాలుగో దేశంగా మన దేశం అమెరికా, రష్యా, చైనా ల తర్వాత స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram