మరో వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా

Continues below advertisement

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే విపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు.లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన తన కుమారుడు ఆశిష్ మిశ్రా గురించి ABP రిపోర్టర్ ప్రశ్నించగా అజయ్ మిశ్రా ఫైర్ అయ్యారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అంతటితో ఆగని మంత్రి.. సదరు జర్నలిస్ట్ చేతి నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. రిపోర్టర్లను దొంగలుగా అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు అజయ్ మిశ్రా. ఆ సమయంలోనే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.లఖింపుర్ ఖేరీ ఘటనపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో ఘటనపై చర్చించాలని కాంగ్రెస్​తో పాటు విపక్షాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. విపక్ష సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్​ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్​సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్​.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram