Gannavaram All Party Protest: గన్నవరాన్ని మచిలీపట్నం జిల్లాలో కలపడంపై స్థానికుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మచిలీపట్నం కృష్ణా జిల్లాలో కాకుండా గన్నవరం నియోజకవర్గాన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో "గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి విజయవాడ జిల్లా తోనే సాధ్యం" అనే నినాదంతో నాలుగు రోడ్ల లో ప్రదర్శన నిర్వహించి అనంతరం కూడలిలో అన్ని పక్షాల నాయకులు ప్రసంగించారు. జిల్లా కేంద్రం ఎంత దగ్గర ఉన్నదనే ప్రాతిపదికన అసెంబ్లీ నియోజక వర్గాలను సమీపంలోని జిల్లా కేంద్రాల్లో చేర్చమని వివరణ ఇచ్చారని విజయవాడ లో అంతర్భాగంగా ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా లో ఎలా చేరుస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రవాణా,విద్య,ఉపాధి,శాంతిభద్రతలు, అంతర్జాతీయ విమానాశ్రయము, కొండపావులూరు లోని ఎన్. డి. ఆర్ .ఎఫ్, మల్లవల్లి పారిశ్రామికవాడ, వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్క్, కేసరపల్లి ఐటి టవర్స్ మొదలైన వీటన్నిటిలో కూడా అభివృద్ధి జరగాలంటే గన్నవరం నియోజకవర్గంలోని 4 మండలాలు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే కలపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.