Kavitha: బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్సీ కవిత అవేర్‌నెస్ వాక్
Continues below advertisement
బ్రెస్ట్ కాన్సర్ మహమ్మారిని నిర్మూలించే భాద్యత సమాజంలో మనందరి పైన ఉందంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని ఏంఎన్ జె కాన్సర్ హాస్పిటల్‌లో ఈ అవగాహన కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా "బ్రెస్ట్ కాన్సర్ అవేర్‌నెస్ వాక్"ను కవిత జెండా ఊపి ప్రారంభించారు. కవిత మాట్లాడుతూ.. ’గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్ళకు వచ్చే కాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తుంది. కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద ఉంది. ఆడపిల్లలు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని’ సూచించారు.
Continues below advertisement