Rajamouli: పవన్ కోసం ఏడాది వెయిట్ చేశా, కానీ సీన్ రివర్స్: రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని టాలీవుడ్ నటులందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి రాజమౌళి పవన్ కల్యాణ్ కోసం 11 నెలలు వెయిట్ చేశారు. ఈ టైమ్ లో ఒక్కసారి గబ్బర్ సింగ్ నుంచి పిలుపువచ్చినా రాజమౌళి దర్శకత్వంలో పవన్ సినిమా చేసేవారు. తెలుగు ప్రేక్షకులకు పూనకాలు వచ్చేవి. కానీ పవన్ కల్యాణ్ అప్పటికే రాజకీయాల వైపుగా అడుగులు వేయటం.. ఈ లోగా ప్రేక్షకులందరికీ చేరువయ్యే సినిమాలు తీయాలనే ఆలోచన రాజమౌళికి రావటంతో ఎంతో మంది ఆశపడిన ఆ కాంబినేషన్ ఆగిపోయిందని దర్శకధీరుడే స్వయంగా తెలిపారు. మగధీరకు ముందే కలిశాననీ, ఎలాంటి సినిమా చేస్తారు అని అడిగితే... ఇదీ అదీ అని లేదు. ఎలాంటి సినిమా అయినా చేస్తా అని పవన్ కల్యాణ్ చెప్పారని వివరించారు. కానీ కబురు రాలేదన్నారు. ఇంతలో లార్జర్ దేన్ లైఫ్ సినిమాలపై రాజమౌళి దృష్టి పెట్టడంతో ఇప్పట్లో పవన్ కల్యాణ్ తో ప్రాజెక్టు ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.