రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసన
ఏ క్షణాన కడప దర్గాకి రామ్ చరణ్ వెళ్లాడో కానీ..అప్పటి నుంచి అదో పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. స్వామి మాల వేసుకుని దర్గాకి వెళ్లడమేంటి చరణ్..అంటూ సోషల్ మీడియాలో కొంత మంది మండి పడుతున్నారు. మరీ ఇంత సెక్యులర్ అయిపోయే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూడా. దీనిపై చాలా పెద్ద డిబేటే జరుగుతోంది. ఏఆర్ రహమాన్ రిక్వెస్ట్ మేరకు రామ్ చరణ్ ఈ దర్గాకి వెళ్లారు. రామ్ చరణ్‌తో పాటు రహమాన్‌పైనా ఫైర్ అవుతున్నారు. అదే రహమాన్‌ని..రంజాన్ నెలలో ఏదైనా హిందూ దేవాలయానికి వెళ్లమంటే వెళ్తాడా..? అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే..దీనిపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఇందులో తప్పులేదని కొందరు..ముమ్మాటికీ తప్పేఅని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదరడం వల్ల రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి..ఇన్‌డైరెక్ట్‌గా ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఏ నమ్మకమైనా మనుషుల్ని కలుపుతుందే తప్ప విడదీయంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని మతాలనూ గౌరవిస్తూనే...రామ్ చరణ్ తన హిందూ మతాన్ని అనుసరిస్తున్నాడని తేల్చి చెప్పారు. రామ్ చరణ్ దర్గాలో పూజలు చేసిన ఫొటోని ఈ పోస్ట్‌లో పెట్టారు ఉపాసన. శబరిమలలో ఓ మసీదులో ప్రార్థనలు చేసే సంప్రదాయం ఉందంటూ ఓ పోస్ట్‌ని కూడా కామెంట్స్‌లో పెట్టారు. బట్...కొంతమంది నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. వేరే మతాన్ని గౌరవించడం అంటే...స్వామి మాలలో దర్గాకి వెళ్లడమా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.