Sai Durgha Tej On His Career | ABP Southern Rising Summit 2024 లో సాయి దుర్గ తేజ్ | ABP Desam
ఏబీపీ సదర్న్ రైజింగ్ సమ్మిట్‌లో హీరో సాయిదుర్గ తేజ తన కెరీర్ స్ట్రగుల్ గురించి చెప్పారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ మొదట్లో సినిమా రిలీజ్ అవడానికే ఐదేళ్లు పట్టిందని అన్నారు. బ్రో సినిమాలో పవన్‌తో నటించడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పారు.
ప్రశ్న: బ్రో సినిమాలో పవన్‌తో నటించారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది..?
జవాబు: ఈ సినిమాతో పవన్ మామయ్యకి గురుదక్షిణ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆయన వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. కెరీర్‌లో గైడెన్స్ ఇచ్చింది ఆయనే. నాకు యాక్టింగ్ చేయాలని ఉండేది. కానీ అంత కన్నా ముందు కొన్ని నేర్చుకోవాలని చెప్పి కిక్ బాక్సింగ్, డ్యాన్స్ క్లాస్‌లకు పంపించారు. ఆయనే నాకు గైడింగ్ ఫోర్స్.
ప్రశ్న: మీరు మెగా ఫ్యామిలీలో పుట్టకపోయుంటే ఏం చేసే వాళ్లు..?
జవాబు: బహుశా ఏ పనీ లేకుండా ఉండిపోయే వాడినేమో. నాకు నేనుగా ఓ టఫ్ రూట్‌ని ఎంచుకున్నాను. 2009లో నా ప్రయాణం మొదలైంది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఐదేళ్ల పాటు నా ఫస్ట్ సినిమా షూటింగ్ జరిగింది. రకరకాల సమస్యలు వచ్చాయి. ఆ తరవాత రెండో సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. సినిమా రిలీజ్ అయ్యే టైమ్‌కి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ సమయంలో మూవీ పోస్ట్‌పోన్ అయింది. 2014 నవంబర్ 14న సినిమా విడుదలైంది. సినిమా బయటకు రావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. అదే టైమ్‌లో నా కో యాక్టర్స్ సినిమాలు రిలీజై స్టార్లు కూడా అయిపోయారు. దీని వల్ల నేను ఓపిగ్గా ఉండడం నేర్చుకున్నాను. ఓ సారి కార్‌లో డీజిల్ అయిపోయింది. ఫిల్ చేయించుకోడానికి డబ్బులు కూడా లేవు. ఫోన్ రీఛార్జ్ చేసుకోడానికీ డబ్బుల్లేవు. అమ్మకి కాల్ చేయలేకపోయా. ఆ తరవాత అమ్మ డబ్బులు పంపించింది. నీకెలా తెలుసమ్మా అని అడిగితే..నీకు డబ్బులు అవసరం అని నాకెందుకో అనిపించింది. అందుకే పంపించానని చెప్పింది.