ముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ముంబైలో తారక్.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగాను కలిశారు. దీంతో వీరి కాంబోపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. కానీ అది సాధ్యమేనా?
జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర పార్ట్ 1’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో చేయనున్న ‘డ్రాగన్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వీటిలో ‘వార్ 2’ 2025 ఆగస్టు 14వ తేదీన, ‘డ్రాగన్’ 2026 జనవరి 9వ తేదీన విడుదల కానున్నాయి. ఆ తర్వాత ‘దేవర పార్ట్ 2’ ఉండనే ఉంది. మరోవైపు సందీప్ కూడా ప్రస్తుతం ప్రభాస్‌తో చేయాల్సిన కాప్ డ్రామా ‘స్పిరిట్’పై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా 2024 చివర్లో కానీ, 2025 ప్రారంభంలో కానీ సెట్స్‌పైకి వెళ్తుంది. తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ చేయాల్సి ఉంది. అల్లు అర్జున్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇవన్నీ అయ్యే సరికి 2030 దాటేస్తుంది. కాబట్టి నియర్ ఫ్యూచర్లో వీరిద్దరూ కలిసి పని చేసే అవకాశం అయితే లేదని చెప్పాలి.